telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ ఫెమ్ హిమజకు పవన్ కళ్యాణ్ లేఖ…

Pawan

బిగ్ బాస్ తర్వాత వరుస అవకాశాలను చేజిక్కించుకుంటుంది హిమజ. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ సినిమా ఓ పాత్రకి హిమజ ఎంపిక అయిన విషయం తెలిసిందే. తన అభిమాన నటుడితో కనిపించే ఛాన్స్ రావడంతో హిమజ ఆనందం వ్యక్తం చేసింది. రీసెంట్ గా పవన్‌తో దిగిన సెల్ఫీలను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తాజాగా పవన్ తనకు రాసిన లేఖను హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని పవన్‌ ఓ లేఖను హిమజకు పంపించారు. ఈ లేఖను హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘నా ఆనందాన్ని మాటల్లోనూ, ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నాన’ని పేర్కొంది. మరోవైపు తమ సినిమాలో పనిచేసిన పహిల్వాన్లను తాజాగా పవన్‌ సత్కరించారు. కాగా పవన్-క్రిష్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ  సినిమా రానుంది. చూడాలి మరి ఈ సినిమాలో హిమజ ఎలాంటి పాత్ర చేస్తుంది అనేది. అలాగే ఈ సినిమా అభిమానులను ఎంతమేర ఆకట్టుకుంటుంది అనేది.

Related posts