telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవినాష్ ను ఫైనల్ కు పంపిన బిగ్ బాస్…!

బిగ్ బాస్ చివరి దశకు చెరుకున్నకొద్దీ నామినేషన్ ప్రక్రియలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. సోమవారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మోనాల్ గజ్జర్, అఖిల్ సార్ధక్, అరియనా, అవినాష్ లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఇంటిసభ్యలులకి మరో ట్విస్ట్ ఇచ్చాడు. సోమవారం జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ అస్సలు భాగలేదని..హౌస్ లో ఉండాలంటే గేమ్ అడకున్నా లక్ ఉండాలని..టాలెంట్ లేని వాళ్ళు ఎలా సేవ్ అవుతారని అవినాష్ విరుచుకుపడ్డారు. దాంతో అవినాష్ కి బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చినట్టు కనిపించింది. బిగ్ బాస్ నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి జండాలు సేకరించే టాస్క్ ఇవ్వగా అవినాష్, అఖిల్ లు టాస్క్ లో గెలిచారు. దాంతో ఇద్దరికి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఎన్నికల క్యాంపెయింగ్ చేసి ఎక్కువ ఓట్లు పడ్డవారికి ఇమ్యూనిటీ లభిస్తుందన్నారు. దాంతో అవినాష్ కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకునే వరకూ వెళ్ళాడు. ఇక అఖిల్ మాత్రం పట్టీ లేనట్టుగానే క్యాంపెయింగ్ చేసాడు. దాంతో అవినాష్ కు ఎక్కువ ఓట్లు పడగా అతడికి ఇమ్యూనిటీ కార్డ్ లభించింది. ఇక ఇమ్యూనిటీ కార్డు ను సొంతం చేసుకున్న తరవాత మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ కార్డు రెండు వరాల పాటు పనిచేస్తుందని తెలిపాడు. అయితే రెండు వారాల్లో కావలిసినప్పుడు వాడుకోవాలా.. లేదంటే ఒకేసారి వాడుకోవాలా అన్నదానిపై క్లారిటీ రాలేదు. మరోవైపు అవినాష్ ను సేవ్ చెయ్యడానికి జబర్దస్త్ స్నేహితులు కూడా రంగం లోకి దిగారు.

Related posts