telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ సినిమాలో తెలుగమ్మాయి ఐటమ్ సాంగ్…?

Pawan-Kalyan

పవర్​స్టార్​ పవన్‌ కల్యాణ్​ హీరోగా, ప్రముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్‌ బందిపోటుగా కనిపించనున్నాడని వార్త‌లు వస్తున్నాయి. ఇందులో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ఐట‌మ్ సాంగ్ లో న‌ర్తించ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ వర్గాల స‌మాచారం. ప‌వ‌న్ మూవీస్ లో స్పెస‌ల్ సాంగ్స్ కు మంచి అప్లాజ్ ఉంటుంది. అందుకే క్రిష్-పవన్ సినిమాలోనూ ఐటమ్​సాంగ్​ పెట్టి అభిమానుల‌ను అల‌రించాల‌ని మూవీ యూనిట్ భావిస్తోందట. ఇక తెలుగమ్మాయి పూజిత పొన్నాడ‌ విషయానికొస్తే… నారా రోహిత్‌ స‌ర‌స‌న‌ ‘తుంటరి’ మూవీలో న‌టించి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘రంగస్థలం’, ‘కల్కి’ చిత్రాల్లో నటించింది.

Related posts