telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ కు పోలీసులు నోటీసులు అందించారు

స్టార్ డైరెక్టర్  రామ్‌గోపాల్‌వర్మ కు  ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకుని ఆయనకు నోటీసులు అందించారు.

ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌ లో  పోస్టులు చేశారు.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వ్యక్తిగతంగా వాటిని అందజేసేందుకు ఎస్సై శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది.

బుధవారం నోటీసులు అందించారు. ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్.శ్రీకాంత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

 

Related posts