telugu navyamedia
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ జీవితం..అత్యంత స్ఫూర్తిదాయకం!!

సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి తెలుగు కౌబోయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు. కృష్ణ గారు నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం రిలీజై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కృష్ణ , మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు.

కృష్ణ జీవితం స్ఫుార్తిదాయక కావ్యమని గజల్ మాష్ట్రో డా. గజల్ శ్రీనివాస్ అన్నారు. డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సినిమారంగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసారని అన్నారు. నటుడుగా, నిర్మాతగా దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుఠలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. భారతీయ చిత్ర చరిత్రలో సాంఘిక, జానపద, కౌబాయ్, చారిత్రాత్మక, జేమ్స్ బాండ్ పాత్రలలో నటించి మెప్పించిన ఏకైక హీరో కృష్ణ అవి అన్నారు.

 తెలుగులో ఓ చరత్రి సృష్టించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం హిందీలో ‘ఖజానా’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. (Twitter/Photo)

తెలుగు చలనచిత్ర గతిని మార్చిన హీరో కృష్ణ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యిచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణ ఫాన్స్ గౌరవాద్యక్షులు రాయప్రోలు శ్రీనివాస ముార్తి మాట్లాడుతూ ఇండియన్ సిరీస్ పై మొదటి కౌబాయ్ చిత్రంగా, పాన్ ఇండియా ముావీగా నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రంఏడు భాషలలో డబ్బు చేయబడి 125 దేశాలలో ప్రదర్శింపబడిందని అన్నారు.

 ఈ చిత్రాన్ని ఆరుద్ర గారు.. బొబ్బిలి యుద్ధం, జరిగిన రోజుల్లో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు మన దేశంలో అడుగుపెట్టినపుడు ఉన్న సంస్థానాల  నేపథ్యంలో ఈ కథను రెడీ చేసారు. (Twitter/Photo)

చైతన్య భారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ అధ్యక్షతన జరిగిన సభలో 50 కేజీల కేకును కట్ చేసారు. కృష్ణ అభిమానులుగా దశాబ్దాల పాటు అభిమాన సంఘాన్ని నడిపి, రంగస్థల నటులుగా పేరెన్నికగన్న శ్రీ మహ్మద్ ఖాజావలి, మానాపురం సత్యనారాయణ, పులఖండం ఉగాది లకు సుాపర్ స్టార్ కృష్ణ అవార్డ్స్ అందజేసారు.

సుమారు 300మంది మహిళ లకు చీట్లు పంపిణీ చేసారు. పట్టణంలోని నాగార్జున ఫాన్స్ అధ్యక్షులు.యల్.డి ప్రసాద్,ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, కృష్ణ ఫాన్స్ నాయకులు బి. హెచ్. సుబ్బరాజు, గంట్లప్రసాద్, బోనం ప్రసాద్,తాతపుాడి రాంబాబుబమడారు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు!!

 అంతేకాదు  మోసగాళ్లకు మోసగాడు రికార్డు స్థాయిలో అన్ని భాషల్లో హిట్టైయింది. అంతేకాదు అప్పట్లోనే 125 దేశాల్లో రిలీజైన తొలి భారతీయ సినిమాగా సూపర్ స్టార్ కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ రికార్డు క్రియేట్ చేసింది. (Photos/Twitter BARAju)

Related posts