telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రేటర్‌ సిత్రాలు : కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర ఉద్యోగుల ధర్నా…

సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. ఖైరతాబాద్ జోన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సనత్ నగర్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పిలిచి బయటే ఉంచారు అంటూ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నారు. ఉదయం ఐదు గంటలకు వచ్చి… ఇక్కడే వేచి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 200 మంది ఉద్యోగులు పోలింగ్ కేంద్రం బయటనే ఉన్నామని తెలిపారు. ఎలక్షన్ కౌంటింగ్ ట్రైనింగ్ ఇచ్చి… డ్యూటీ లు వేసి ఇప్పుడు సరిపోయారు అంటూ మీరు ఇంటికి తిరిగి వెళ్లండి అని చెప్తున్నారని పేర్కొన్నారు. తాము ఇక్కడకు విధులకు వచ్చినట్టు అటెండెన్స్ కూడా చేయడం లేదని.. కావలసిన సిబ్బంది కంటే అధికంగా ఎందుకు పిలిచారు అంటూ ఆందోళనకు దిగారు. కాగా…కౌంటింగ్‌ మొదలు కావడంతోనే… కమలం వికసిస్తోంది. కారు జోరుకు బ్రేకులు వేస్తు… బీజేపీ దూసుకుపోతోంది. అటు పోస్టల్‌ బ్యాలెట్‌ లోనూ బీజేపీ మంచి ఫలితాలను రాబట్టింది. ఇప్పటి వరకు బీజేపీ 35 సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ మొదట్లోనే డీలా పడిపోయి… 17 సీట్లల్లో లీడింగ్‌లో ఉంది. ఇది ఇలా ఉండగా… మధ్యాహ్నం లోపు పూర్తి ఫలితాలు రానున్నాయి. ఇక ఎవరు గెలుస్తురో చూడాలి. 

Related posts