telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ్‌లో అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే

pooja

అల్లు అర్జున్ సరసన ‘డీజే’, ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో, తాజాగా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి వరుస హిట్లతో ఊపు మీద ఉన్న పూజా హెగ్డే మరో అవకాశాన్ని అందుకుంది. తమిళ్‌లో అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అంతేకాదు దాదాపు పూజా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం ఖాయం అని తెలుస్తుంది. ఇక పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాలోను నటిస్తోంది. బాలీవుడ్ లో సల్మాన్‌తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది.

Related posts