telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అనంతపురం లో రోడ్డుప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ తీవ్ర‌ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ లో ఉరవకొండ లో జ‌రిగిన ఘోర‌ రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అనేక‌ మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేర‌కు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామ‌ని ప్రకటించారు.

మరోవైపు ఈ ఘటనపై ఏపీ గవర్నర్​ బిశ్వభూషన్​ హరిచందన్​ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్​ సూచించారు.

ఆదివారం వివాహ వేడుకకు వెళ్లివ‌స్తుండ‌గా అనంతపురం – బళ్లారి జాతీయ రహదారిలోని బూదగవి – కొట్టాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును వేగంగా ఢీకట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు నేత‌లు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

Related posts