telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సినిమా టిక్కెట్స్‌పై మంచు విష్ణు సంచలన కామెంట్స్..

హీరో మంచు విష్ణు సినిమా టికెట్ల ధరలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలన్నారు.

తిరుపతిలో మన్యం రాజు మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభం అవుతుందని మంచు విష్ణు అన్నారు. ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని, సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు .త్వరలోనే మా అసోసియేషన్‌ తరపున మా భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు.

సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారు.. ఏపీలో తగ్గించారని, కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారు కాబట్టి దీనిపై సినీ పరిశ్రమ ఏకత్రాటి పైకి రావాలని అన్నారు.

సినిమా టికెట్లపై తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంటుందని.. ఆ నిర్ణయం మేరకే ముందుకెళ్తామని తెలిపారు.

సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతమ‌ని, దానికీ, ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దన్నారు. ఈ భేటీలపై వ్యక్తిగతంగా తన అభిప్రాయంతో పనిలేదన్నారు. సినిమా టికెట్ల ధరలపై ఒకరిద్దరు మాట్లాడి వివాదం చేయడం సరికాదు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. నేను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేను. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి.

టికెట్ల ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసింది. గతంలో వచ్చిన జీవోలు తీసేసిన జీవోలపై ముందు మాట్లాడాలని.. ఆ తర్వాతే ప్రస్తుత జీవోలపై మాట్లాడాలన్నారు మంచు విష్ణు.

కాగా..ఇటీవ‌ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో చిరంజీవి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఇటీవల భేటీ అయ్యారు.  సినిమా టికెట్ల వివాదంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని  చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు విజయవాడ వెెెళ్లిన ఆయన.. గంటన్నరపాటు ఏపీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

సినీ పరిశ్రమ పెద్దగా కాకుండా పరిశ్రమ బిడ్డగా వచ్చానని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ అంశాలపై మరోమారు సమావేశం జరిగే అవకాశముందని చిరంజీవి వెల్లడించారు.

Related posts