telugu navyamedia
ఆరోగ్యం

దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..

దేశంలో కొవిడ్​ మహమ్మారి త‌గ్గు ముఖం ప‌డుతుంది. గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. దేశ‌వ్యాప్తంగా 83, 876 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జరిపిన 11,56,363 పరీక్షల్లో 83,876 కొత్త కేసులు నమోదయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులెటిన్ లో విడుద‌ల చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు 895 మంది కోవిడ్ బాధితులు మ‌ర‌ణించ‌గా..1,99,054 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.

Covid Cases In India: India's Daily Covid Cases Drop Below 1 Lakh After A  Month

ప్రస్తుతం దేశంలో 11, 08, 938 యాక్టివ్​ కేసులు ఉండ‌గా.. ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన‌వారి సంఖ్య 5,02,874కు చేరింది. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది.

కాగా, థ‌ర్డ్ వేవ్ విజృంభ‌ణ మొద‌లైన త‌ర్వాత‌ జనవరి 6వ తేదీ నుంచి లక్ష మార్క్‌కు దిగువ‌గా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి..

దేశంలో వ్యాక్సినేషన్‌ పంపిణీ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇప్పటి వ‌ర‌కు 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసిన‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Related posts