telugu navyamedia
ఆరోగ్యం

ఈ ఆకు కూర తింటే కీళ్ళ నొప్పు మాటుమాయం..!

కొంత మంది ఆకు కూర‌ల‌ని ఇష్ట‌ప‌డ‌రు. ఈ కూర‌లో ఉండే పోష‌క‌విలువ‌లు తెలిస్తే త‌ప్ప‌కుండా తిన‌డం అల‌వాటు చేసుకుంటారు. ఇంత‌కి ఏంటి ఆకు కూర అనుకుంటున్నారా! ఆకు కూర‌ల్లో మేలైన కూర పాలకూర. ఇది వంటికి ఎంతో చ‌లువ చేస్తుంది. ఈకూర‌ను ఎక్కువ‌గా స‌లాడ్‌, బ‌ర్గార్‌, శాండ్‌విచ్‌, సూప్స్‌లలో కూడా ఉప‌యోగిస్తారు.

ఓ క‌ప్పు పాల‌కూర‌లో కేవ‌లం 5 కేల‌రీలు మాత్ర‌మే ఉంటాయి. సోడియం మాత్రం 10 గ్రాములు ఉంటుంది. ఫ్యాట్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు. ఈ పాల‌కూర కీళ్ళ‌నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. బ్రెయిన్ చురుగ్గా అయ్యేలా చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది, క్యాన్స‌ర్‌తో పోరాడుతుంది. అంతేకాదు బ‌రువు త‌గ్గేందుకు ఇది స‌రైన ఔష‌దమ‌నే చెప్పొచ్చు.

కంటిచూపును మెరుగుప‌రుస్తుంది, జీర్ణక్రియ‌న స‌రిచేస్తుంది. నిద్ర‌లేమిని పొగొడుతుంది, వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఎముకులు బ‌లంగా ఉండేందుకు తొడ్ప‌డుతుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు పాలకూర ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

పాలకూరలోని పొటాషియం… కండరాలను బలపరుస్తుంది. ఇందులోని విటమిన్ A… చర్మాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం… రక్త ప్రసరణను కూడా బాగుచేస్తుంది. ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

ఆడ‌, మ‌గ తెడా లేకుండా జుట్టు రాలుతుంటుంది. ఈ కూర‌లో విటమిన్ కె పుష్క‌లంగా ఉంటుంది.. జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి, బలంగా చేస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్… ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది.

Related posts