దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 47,092 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 500 మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 35,181 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,20,28,825కి పెరిగాయి.. ఇక, కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 4,39,529 మంది మృతిచెందగా.. ప్రస్తుతం దేశంలో 3,89,583 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 81,09,244 డోసుల వ్యాక్సిన్ వేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 66,30,37,334 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. నిన్న ఒక్క కేరళలోనే 32,803 కేసులు నమోదు కాగా, 173 మంది ప్రాణాలు కోల్పోయారు.