దేశంలో కరోనా మహమ్మారి తగ్గు ముఖం పడుతోంది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
ఒక నెల రోజుల తర్వత భారత్ లో కోవిడ్ రోజువారీ కరోనా కేసులు లక్ష దిగువకు పడిపోయాయి. మరణాలు మాత్రం నిత్యం వేయికి పైగానే నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 1,118 మంది మరణించారు. 1,80,456 మంది కోలుకున్నారు
భారత్‌లో ప్రస్తుతం 9,94,891 యాక్టివ్ కేసులు ఉండగా..రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతం ఉండగా..రికవరీ రేటు 96.19 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం..
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దేశ్యాప్తంగా 170 కోట్లకు పైగా అంటే 1,70,21,72,615 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు తెలింది..