telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

చిలగడ దుంపల్లో ఎన్ని పోషకాలు.. మిస్ కాకండి

చిలగడదుంపల్ని ఉడికించి తింటుంటాం, కూరల్లోనూ వాడుతుంటాం. అయితే దుంపల వల్ల బరువు పెరుగుతూరన్న కారణంతో ఈమధ్య చాలా మంది వీటికి దూరంగా ఉంటున్నారు. కానీ వీటిల్లో విటమిన్ – ఎ, సి, బి6, నియాసిన్, మాంగనీస్, పొటాషియం, పాంటోథెనిక్ ఆమ్లం, కాపర్.. వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా వీటిల్లో పుష్కలంగా ఉండే పీచు యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేయడంతోబాటు పేగు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఇందులోని ఆంధోసైనిన్లు అధ్యయనశక్తిని జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయని వృద్ధాప్యంలో వచ్చే మతిమరపుని తగ్గిస్తాయి. నారింజ రంగు చిలగడ దుంపల్లోని విటమిన్ – ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడటంతో బాటు రోగనిరోధకశక్తిని పెంచుతుందట. వీటిని ఆహారం లో భాగంగా చేసుకుంటే బీపీ, మధుమేహం కూడా నియంత్రణలో ఉంటాయి.

Related posts