telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఐఎస్‌బీ ఆసియాలో టాప్ స్కూల్‌గా ఎదిగింది..-హైదరాబాద్‌ లో ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో మోడీ

*ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుంది..
*ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారు..
*ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణం..
*ఐఎస్‌బీ ఆసియాలో టాప్ స్కూల్‌కి ఎదిగింది..
*2001 లో ఐఎస్‌బీని వాజ్‌పేయ్‌ ప్రారంభించారు

ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ స్నాతకోత్సవంలో 960 మంది విద్యార్ధులు  పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడ‌ల్స్‌ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.  ఐఎస్‌బీ ఒక మైలురాయివంటిదని ఆయన చెప్పారు. 20 ఏళ్ల వసంతాలను ఐఎస్‌బీ జరుపుకుంటుందని మోడీ చెప్పారు.50 వేల మంది ఇక్కడ శిక్షణ పొంది బయటకు వెళ్లారని ప్రధాని మోడీ వివరించారు.

ఆసియాలోనే ఉత్తమ సంస్థల్లో ఐఎస్‌బీ ఒకటిగా నిలిచిందన్నారు.ఇక్కడి విద్యార్ధులు ఎన్నో స్టార్టప్ లు మొదలు పెట్టిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఐఎస్‌బీలో చదివినవారు ఎంతో మంది విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.

ఐఎస్బీ ఈ స్థాయికి రావడం వెనుక చాలా మంది కృషి ఉందన్నారు.. 2001లో వాజ్ పేయ్ ఈ స్కూల్ ను ప్రారంభించారన్నారు. ఆసియాలోనే ఐఎస్ బీ టాప్ బిజినెస్ స్కూల్ అని ఆయన చెప్పారు. జీ 20 దేశాల్లో భారత్ అతి వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు.ఇంటర్నెట్ వాడకంలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉందన్నారు. 

జీ 20 దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని ప్రధాని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. అంతర్జాల వినియోగదారుల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. స్టార్టప్‌ల రూపకల్పనలో భారత్‌ మూడో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. వినియోగదారుల మార్కెట్‌లో భారత్‌ మూడో స్థానంలో ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు.

Related posts