telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ…

Modi Mask

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహదుల్లో పాటు పలు రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. అయితే.. ఈరోజు, రేడియోలో ప్రధాని ప్రసంగం చేస్తున్నంత సేపు.. ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా స‌హా ప‌లు రాష్ట్రాల్లో రైతులు గిన్నెలు, డబ్బాలు, మరికొన్ని వస్తువులను పట్టుకుని.. వాటిని వాయించారు.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం, కొత్త చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. రైతు వ్యతిరేక వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన విరమించేదిలేదని ప్రకటించారు. ప్రధాని మ‌న్ కీ బాత్ కార్యక్రమం సమయంలో తలెల చ‌ప్పుళ్లు చేస్తూ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్న రైతులు.. ఇవాళ మ‌న్ కీ బాత్ ప్రసంగం మొద‌లు కాగానే తలెలు, డబ్బాలు వాయిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఇక, మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతదేశ‌ యువతను చూసినప్పుడల్లా తనలో భరోసా పెరుగుతుందని, మనసు ఉల్లాసంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఏదైనా సాధించగల, చేయగల స‌త్తా వారిలో ఉన్నద‌ని పేర్కొన్నారు. ఎంతటి సవాలైనా వారి ముందు చిన్నదేన‌ని, పెద్ద విష‌యం కాద‌ని ప్రధాని చెప్పారు. యువ‌త‌వల్ల సాధ్యం కానిది ఏదీ లేదంటూ వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. స్వయం సమృద్ధి, భారత్‌లో తయారీ వంటి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ తన అభిప్రాయాల‌ను వెల్లడించారు. నూత‌న సంవ‌త్సరం 2021లోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో.. దేశానికి చెందిన పలువురు సిక్కు సాధువులు, మత గురువుల త్యాగాలను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు.

Related posts