telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బ్రేకింగ్ : తెలంగాణాలో మరో ఎమ్మెల్యేకు కరోనా

క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే దానికి మాత్రం ఏ మాత్రం వివ‌క్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్ప‌టికే ఎంతోమంది ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనాబారిన ప‌డ్డారు.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను కూడా ట‌చ్ చేసింది క‌రోనా.. తాజాగా..పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. తనను కలిసిన వ్యక్తులు కరోనా టెస్టులు చేయించుకోవాలని అయన కోరారు. ఇటు తెలంగాణ కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో ఐదుగురు కరోనా తో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,35,656కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,16,352 మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్త్రంలో మొత్తం 1,324 మంది మృతిచెందారు.

Related posts