telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమెరికాలో ఒకే రోజు 10 వేల కేసులు.. పలు నగరాల షట్‌డౌన్..!

karona

అమెరికాలో కరోనా వైరస్ దూసుకుపోతుంది. చైనాలో పురుడుపోసుకున్న ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పుడు అక్కడ తగ్గుముఖం పట్టగా  ప్రపంచ దేశాలను, ముఖ్యంగా ఐరోపా దేశాలను కలవరపెడుతోంది. ఇక, అమెరికాలోనూ ఈ వైరస్ తన ప్రతాపం చూపుతోంది. అక్కడ నిన్న ఒక్క రోజే ఏకంగా 140 మంది ప్రాణాలు కోల్పోయారు.

అగ్రరాజ్యంలో కొత్తగా, 10,168 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 43,734కు పెరిగింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు నగరాలను షట్‌డౌన్ చేయగా నిన్న న్యూయార్క్‌ను మూసివేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

Related posts