telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మెట్రో రైలు స‌ర్వీసుల్లో స్వ‌ల్ప మార్పులు…

rayadurgam metro line starts on 29th

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాత్రి 9 గంట‌ల నుంచే తెలంగాణలో క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రానున్న నేప‌థ్యంలో.. హైద‌రాబాద్ మెట్రో రైలు త‌న స‌ర్వీసుల్లో స్వ‌ల్ప మార్పులు చేసింది. చివ‌రి స్టేష‌న్ నుంచి రాత్రి 7.45 గంట‌ల వ‌ర‌కే చివ‌రి మెట్రో రైలు అందుబాటులో ఉంటుంద‌ని.. రాత్రి 8:45 గంట‌ల‌కు చివ‌రి స్టేష‌న్‌కు మెట్రో రైలు చేరుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు మార్చిన స‌మ‌యాల్లోనే స‌ర్వీసులు న‌డుస్తాయ‌ని పేర్కొంది.. అయితే, ఉద‌యం పూట మెట్రో స‌ర్వీసుల‌కు ఎలాంటి అవ‌త‌రాలు లేవు.. ఉద‌యం 5 గంట‌ల‌కే క‌ర్ఫ్యూ ముగియ‌నున్న నేప‌థ్యంలో.. ఉద‌యం 6:30 గంట‌ల నుంచి మొద‌టి రైలు యథావిధిగా అందుబాటులో ఉంటుంద‌ని మెట్రో ప్ర‌క‌టించింది.. ఇక‌, క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న స‌మ‌యంలో.. ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు, శానిటైజ‌ర్లు వాడాల‌ని సూచించింది హైద‌రాబాద్ మెట్రో రైలు.

Related posts