అమెరికాలో ఓ నిందితుడు అరెస్ట్ అయిన వెంటనే పోలీసులతో తనంతట తానే ఓ ఫొటో దిగాడు. సాధారణంగా నిందితులు మీడియాకు తమ మొహాన్ని చూపించడానికి పెద్దగా ఇష్టపడరు. వివరాల్లోకి వెళ్తే… హీథ్ స్వఫార్డ్ (24) అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తూ అలబామాలోని లేసీ స్ప్రింగ్స్ ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. హీథ్‌ను పట్టుకుని పోలీసులు కారులో ఎక్కిస్తుండగా.. హీథ్ వారిని ఓ చిన్న కోరిక కోరాడు. పోలీసులతో కలిసి హ్యాండ్‌కఫ్స్‌లో ఓ ఫొటో దిగాలని అడిగాడు. హీథ్ అడిగిన కోరికకు పోలీసులు షాకైనప్పటికీ.. అతడి కోరికను తీర్చారు. హీథ్‌తో పాటు నవ్వుతూ పోలీసులు సైతం ఫొటోకు స్టిల్ ఇచ్చారు. నెటిజన్లు ఈ వార్తపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
previous post