telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ఆరేళ్ల చిన్నారికి .. ప్రతిష్టాత్మక పెటా అవార్డు…

PETA award to six years kid

డెరెక్ సరదాగా తన బుజ్జి సైకిల్‌పై తొక్కుకుంటూ వెళుతున్నాడు. హఠాత్తుగా అటుగా చంగుచంగున పరుగులు తీస్తూ వచ్చిన ఓ కోడిపిల్ల డెరెక్ సైకిల్ టైర్ కింద పడి గాయాలపాలైంది. వెంటనే డెరిక్ ఆ కోడిపిల్లను చూసి చాలా బాధపడ్డాడు. విపరీతంగా ఏడ్చేశాడు. వెంటనే దాన్ని తీసుకుని తన ఇంటికి పరుగులు తీశాడు. కోడిపిల్లను హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిందిగా తన తల్లిదండ్రులను కోరాడు. అయితే అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆ కోడిపిల్ల మృతి చెందింది. కోడిపిల్ల చనిపోయిన విషయాన్ని డెరిక్‌కు తన తల్లిదండ్రులు చెప్పారు. ఇదంతా ఆ చిన్నారికి అర్థం కాలేదు.

కోడిపిల్లను ఎలాగైనా బతికించాలన్న తపన తనలో పెరిగిపోయింది. వెంటనే ఓ ఆస్పత్రికి కోడిపిల్లను తీసుకుని పరుగులు తీశాడు. ఏమైంది అని అక్కడి నర్సు ఈ చిన్నారిని ప్రశ్నించింది. జరిగిన విషయం చెప్పాడు. కోడిపిల్ల తన సైకిలు టైరు కింద పడిందని దాన్ని బతికించాలంటూ డెరిక్ నర్సును ప్రాథేయపడ్డాడు. అంతేకాదు తన దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటూ అక్కడి నర్సుకు చూపించాడు. ఆమె వెంటనే డెరిక్ ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఓచేతిలో చనిపోయిన కోడిపిల్ల మరో చేతిలో పది రూపాయల నోటు పట్టుకుని ఉన్న డెరిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోడిపిల్లను బతికించేందుకు పది రూపాయలు సరిపోవేమో అని వంద రూపాయలు తీసుకొద్దామని తిరిగి ఇంటికి చేరుకున్నాడు డెరిక్.

సోషల్ మీడియాను డెరిక్ ఫోటో చుట్టేసింది. కోడిపిల్లను కాపాడుదామన్న తనలోని తపన ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. తన పాఠశాలలో డెరిక్‌ను సన్మానించారు. ఫేస్‌బుక్‌లో ఫోటోకు లక్ష లైకులు 94వేల షేర్లు వచ్చాయి. డెరిక్‌కు మూగజీవుల పట్ల ఉన్న ప్రేమను ఆప్యాయతపై నెటిజెన్లు ప్రశంసలు కురిపించారు. ఆ చిన్నారి అమాయకత్వం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది… కోడిపిల్లను కాపాడాలన్న ఆ తపన తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేశారు. ఆ కోడిపిల్లకు తగిన గాయంతో ఆ చిన్నపిల్లాడు ఎంతగా తల్లడిల్లిపోయాడో అతన్ని చూస్తే అర్థమవుతోందంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇక ఫోటో వైరల్ అవడంతో ఆ చిన్నారికి పెటా సంస్థ ‘కంపాషినేట్ కిడ్’ అనే అవార్డును స్కూలు యాజమాన్యం ద్వారా ప్రదానం చేసింది.

Related posts