telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాయలసీమలో ప్రతి ఊరుకు నీళ్లివ్వాలని కేసీఆర్ చెప్పారు : మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy

సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల పక్షపాతి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతుల గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. చిత్తూరు జిల్లాలో 90శాతం పల్ప్‌ ఫ్యాక్టరీలన్నీ చంద్రబాబు బంధువులవే. పల్ప్‌ కంపెనీలన్నీ సిండికేట్‌ అయి ధరలను ధరలను తగ్గించాయని అన్నారు. మామిడి రైతులు ప్రతి రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడటంతో మామిడి ధరలు తగ్గిపోయాయి. అవసరానికి మించి దిగుబడి ఉంటే ధర తగ్గడం కామన్. మ్యాంగో బోర్డ్ ఏర్పాటు ప్రతిపాదనలు సీఎం జగన్ కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌పై మాట్లాడుతూ.. అక్రమ ప్రాజెక్టు కట్టడం లేదు, మా వాటా నీళ్లు మేం తీసుకుంటాం.. అక్రమంగా నీళ్లు తీసుకోమని చెప్పారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ స్వయంగా జగన్‌కు చెప్పారు. ఆ సమావేశంలో నాతో పాటు కామెంట్ చేసిన తెలంగాణ మంత్రి కూడా ఉన్నారు. రాయలసీమలో ప్రతి ఊరుకు నీళ్లివ్వాలని స్వయంగా కేసీఆర్ చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కేసీఆర్ చెప్పిన మాటలకు తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. ఏపీకి రావాల్సిన నీటి వాటాను మాత్రమే వాడుకుంటున్నామని పెద్దిరెడ్డి వివరించారు. తెలంగాణకు ఎంతో చేశారని వైఎస్‌ను కేసీఆర్ పొగిడారని.. ఇప్పుడు తెలంగాణ మంత్రులు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

Related posts