telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేటి నుండి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.

నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పండుగ ఏర్పాట్లు, శాంతి భద్రతలు వంటి కీలక అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

రేపు పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, స్థానిక ప్రజలతో కలిసి పండుగ జరుపుకుంటారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

పిఠాపురం ముంపు ప్రాంతాలను పరిశీలించి, బాధితుల సమస్యలను తెలుసుకుంటారు.

ఈ నెల 10న జిల్లా పోలీస్ అధికారులతో శాంతి భద్రతలు, పండుగ సీజన్ జాగ్రత్తలపై సమీక్ష నిర్వహిస్తారు. రంగరాయ మెడికల్ కాలేజీలో శంకుస్థాపనలు చేయనున్నారు.

Related posts