telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెట్రోలో ప్రయాణించిన “వకీల్ సాబ్”

Vakeel-Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పవన్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్లో ప్రయాణించారు. మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. సూట్, బూటులో మెట్రో స్టేషన్‌లోకి ఎంటరయిన పవన్‌ను చూసి ప్రయాణీకులు తన్మయత్వానికి లోనయ్యారు. మెట్రోలో ప్రయాణిస్తోన్న సమయంలో పవన్ తోటి ప్రయాణీకులతో కాసేపు ముచ్చుటించారు. ఈ జర్నీలో పవన్ వెంట మూవీ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా చాలా వరకు పూర్తవుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్, వీకే నరేష్, సుబ్బరాజు, అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శృతి హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హిందీ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన కోర్టు సెట్‌లో పవన్ కళ్యాణ్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

Related posts