telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అటు పాక్, ఇటు చైనా తీట తీర్చేసే బిల్లుగా … జమ్మూ కశ్మీర్ పునర్విభజన .. ప్రధాని అస్త్రం..

bill that warns pak and china on violence

జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు పై గులాం నబీ ఆజాద్ లాంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేసినప్పటికీ లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు మద్దతుగా 370 ఓట్లు రాగా.. 70 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. అన్యాయంగా కాశ్మీర్ ని విభజించారని కశ్మీర్ కి చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు వీరంతా ఈ విభజనను ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు..అంటే అదొక రాజకీయ చదరంగం అనుకోవాల్సిందే. అయితే ఇది దేశానికి సంబందించిన విషయం కాబట్టి, ఈ రాజకీయాలు పనికిరావు. ఇంకా ఆయా పార్టీలు రాజకీయాలు చేస్తే పుట్టగతులు లేకుండా పోవటం ఖచ్చితంగా జరుగుతుంది.

కేవలం పాక్‌ వల్లే కశ్మీర్‌ లో యువకులు ఇండియాకి వ్యతిరేఖంగా పని చేస్తున్నారనేది కాదనలేని నిజం. మరి అలాంటి పాక్ ఆటలు అరికట్టే నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వాన్ని అభినందించాలి. అసలు మోదీ చేసింది కరెక్టా..లేక ప్రజాస్వామ్య పద్ధతులకు పూర్తి విరుద్ధమా అనే విషయం పక్కన పెడితే.. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం కశ్మీర్‌ భవిష్యత్‌ నే మార్చబోతుందనేది అక్షర సత్యం. అయితే ఈ విషయం పై ఇంతవరకూ కాంగ్రెస్ డైరెక్ట్ గా తన అభిప్రాయాన్ని చెప్పలేదు. బిల్లు ఆమోదం సరిగ్గా జరగలేదు.. మోదీ ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఇలాంటి అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. ఆర్టికల్ 370 రద్దుకి తాము సపోర్ట్ చేస్తున్నామా.. లేదా అనేది స్పష్టం చేయడం లేదు. బహుశా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే కాంగ్రెస్ పార్టీకి హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడిపోతుంది.. ఒకవేళ సపోర్ట్ చేస్తే తమకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు అయిన ముస్లిం ఓటర్లు దూరమైయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి లెక్కల మధ్య కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంటే.. అక్కడ మోదీ మాత్రం పాక్ కి చమటలు పట్టిస్తున్నాడు. ఏదిఏమైనా ఇప్పటికైనా పాక్ కి బుద్ధిచెప్పే ధైర్యమైన నిర్ణయం తీసుకోవటం స్వాగతించదగ్గ పరిణామం. పెద్దలు అన్నట్టు.. మెత్తగా ఉండేవాడిని చూస్తే మొత్తబుద్ధవుతుందని.. అన్న చందాన.. ఎవరి జోలికి వెళ్లకుండా తమ బ్రతుకు తాము బ్రతుకుతున్న భారతీయులను బాధించేవారు ఎక్కువ అవుతున్న సందర్భంలో ఈ నిర్ణయం హర్షణీయం. ఇక ఎవరైనా మొత్తటానికి ఆలోచన చేయడానికే భయపడతారు.

Related posts