*స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితోనే జనసేన స్థాపించాం
*ఓట్లు వస్తయో లేదో తెలియదు కానీ వాస్తవాలు మాత్రమే తాను మాట్లాడతా..
* ఓట్లు కోసం మత రాజకీయాలు చేయడం సరైంది కాదు
*వైసీపీ నేతల భావాలను తనపై రుద్దొద్దు..
*మరోసారి వైసీపీ పాలన వస్తే..ఉద్యోగ, ఉపాధి అవకాశలుండవు..
స్వాతంత్ర్య ఉద్యమం స్ఫూర్తితో జనసేన స్థాపించబడిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు .ఎవరినైనా కలపడం కష్టం.. విడదీయడం సులభమన్నారు. కుల, మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కావాలి.. దాన్ని విస్మరిస్తే విచ్చిన్నమేనన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అమరావతి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యలయంలో జాతీయ జెండాను పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు..
అనంతరం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు..జనసేన అధికారంలోకి వస్తే.. ఏవో అద్భుతాలు జరిగిపోతాయని తాను చెప్పడం లేదని.. కానీ వ్యవస్థలను పటిష్టం చేసి తీరుతామని పవన్ కల్యాణ్ అన్నారు. నాయకత్వానికి ముందు చూపు లేకపోతే ఎన్నో దారుణాలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ విభజన వల్ల ఎంతో రక్తపాతం జరిగిందన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశ జీవన విధానంలోనే ఉందని స్పష్టం చేశారు.
ఒక మసీదు, ఒక చర్చికి అపవిత్రం జరిగితే మనం బలంగా ఏ విధంగా ఖండిస్తామో.. దేవాలయాలకు అలాంటి పరిస్థితి వస్తే అంతే బలంగా ఖండిస్తామని.. అదే సెక్యులరిజమన్నారు. కేవలం ఓట్లు కోసం మత రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. దేశానికి వెన్నెముక భారతీయ సంస్కృతి.. ఓట్లు వస్తయో లేదో తెలియదు కానీ వాస్తవాలు మాత్రమే తాను మాట్లాడతానన్నారు. మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన లక్ష్యమని, రామతీర్థం ఘటనలో ఖండిచాం తప్ప.. రెచ్చ గొట్టలేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకొచ్చే వారిని, తప్పులు చేసే వారిని జన సైనికులు, నేతలు ముక్త కంఠంతో ఖండించాలని సూచించారు.
కోట్లాది మందికి నిర్దేశం చేయాలంటే పొలిటికల్ గా చాలా అనుభవం సంపాదించాలని పవన్ పేర్కొన్నారు. గడిచిన 15 ఏళ్లల్లో తాను ఎన్నో అనుభవాలు సంపాదించానని, అనుభవం లేకుండా పదవులు వస్తే వైసీపీ పాలనలా ఉంటుందని ఎద్దేవా చేశారు. పదవి వెతుక్కుంటూ రావాలి గానీ మనం పదవి వెంట పడకూడదని చెప్పారు
తనకు పదవే కావాలి అనుకుంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాణ్ని అని గుర్తు చేశారు. ఏదైనా రాజకీయంగా లబ్ధి కావాలి అంటే.. నేరుగా ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకుని.. ఆయన్నుఅడిగే చనువు తనకు ఉంది అన్నారు. కానీ మీలా ప్రజల బలాన్ని.. ప్రేమను తాకట్టు పెట్టడం తనకు ఇష్టం లేదని వైసీపీ నేతలకు పవన్ చుర.
తాను సినిమాలు చేసేది తన ఖర్చల కోసం కాదన్నారు.. పార్టీ నడపడానికే సినిమాలు చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. అయితే తాను సంపాదించిన డబ్బులతో 8 జీపులు కొనుక్కుంటే లేని పోని ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. వైసీపీ నేతల్లా తన దగ్గర బ్లాక్ మనీ లేదన్నారు.. వేల కోట్లు అక్రమంగా సంపాదించలేదని వివరణ ఇచ్చారు.
దావోస్ వెళ్లి ఫొటోలు దిగినంత మాత్రానా రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు వచ్చినట్లు కావని పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు
ఆ రోజు ఓట్లు చీలకూడదని.. తాను మాట్లాడిన మాటకు అర్థాలు మార్చేశారని.. అసలు అలా అనడానికి కారణం వైసీపీ నేతలే కాదా అని నిలదీశారు. వ్యవస్థలను నాశనం చేశారని.. అరాచకాలతో ప్రజల ప్రాణాలని తీస్తున్నారని.. అందుకే మరోసారి వైసీపీ అధికారంలోకి రాకూడదన్నదనే దన ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల నాటికి జనసేన మ్యానిఫెస్టో ఎలా ఉండబోతోందో కూడా పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. పేదలకు ఉచిత పథకాలు అందిస్తే సరిపోదని.. వారు ఆర్థికంగా ఎదగడానికి చేయూత ఇవ్వాలని.. పెట్టుబడి పెట్టాలని.. జనసేన అదే చేస్తుంది అన్నారు.
చంద్రబాబు గజదొంగ..కేసీఆర్, కేటీఆర్ మంచివారు: మోహన్‌బాబు