telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పొత్తుల‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ..

2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల‌పై సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అందరూ తనను పొత్తుల పై అడుగు తున్నారని.. పొత్తుల విష‌యంలో మూడు ఆప్ష‌న్ల‌పై చ‌ర్చిద్దామ‌ని జ‌న‌సేన నేత‌ల‌కు సూచించారు.

అప్షన్ 1: జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
అప్షన్ 2: జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం
అప్షన్ 3: జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం

తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని బైబిల్ సూక్తి నమ్ముతాను అన్నారు. ఇప్పటికే మూడు సార్లు తగ్గానని.. మళ్లీ తననే తగ్గమనడం కరెక్టు కాదని.. ఈ విషయంలో తెలుగుదేశం నేతలే ఆలోచించుకోవాలి అన్నారు.

ఒకప్పుడు వన్ సైడ్ లవ్ అంటూ చంద్ర‌బాబు అన్నార‌ని ఇప్ప‌డు వార్ వన్ సైడ్ అయ్యింది అంటున్నార‌ని సెటైర్ వేశారు. పొత్తులపై తెలుగు దేశం పార్టీ నేతలు పూర్తి క్లారిటీ వస్తే.. అప్పుడు మాట్లాడుతాన‌ని అన్నారు.

జనసేన, బిజెపి మధ్య బందం గట్టిగా ఉంది అన్నారు. అయితే కరోనా కారణంగా తమ మధ్య సోషల్ డిస్టెన్స్ వచ్చిందన్నారు. ఇటీవల తనకు ఏపీ నేతలతో సంబంధం లేదని.. జాతీయ బీజేపీ నేతలతోనే బంధం ఉంది అంటూ ప‌వ‌న్ తెలిపారు.

తాజాగా నడ్డా ఏపీకి వస్తున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. తనకు ముందుగా ఉన్న కార్యక్రమాల కారణంగా ఆయన్ను కలువలేకపోతున్నాను అన్నారు. బీజేపీ జాతీయ నాయకులతో కూడా మాట్లాడాను అన్నారు. రైతుల సమస్యలు, రాష్ట్రంలో పరిస్థితులు కూడా వివరించాను అన్నారు.

Related posts