telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

బంగీజంప్ చేస్తే చంద్రబాబు మరోసారి సీఎం: వైసీపీ నేత గజ్జెల లక్ష్మీ

YCP padma comments Chandrababu
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత గజ్జెల లక్ష్మీ విమర్శనాస్త్రాలు సందించారు. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన అన్ని పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆమె విమర్శించారు. జగన్ ఆటో డ్రైవర్ డ్రెస్, నల్ల చొక్కా వేస్తే చంద్రబాబు కూడా వేశారని దుయ్యబట్టారు. చివరికి నవరత్నాలను సైతం చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక జగన్ హామీల్లో చంద్రబాబు కాపీ కొట్టకుండా మిగిలిపోయింది  ‘బంగీ జంప్’ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. 
చంద్రబాబు బంగీజంప్ చేస్తే తప్పకుండా మరోసారి ముఖ్యమంత్రి అవుతారని సెటైర్ వేశారు. చిత్తూరు జిల్లా వాసులుగా తామంతా చంద్రబాబు బంగీ జంప్ చేస్తే చూసి సంతోషిస్తామన్నారు.  ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే  బంగీజంప్ చేయాలని చంద్రబాబుకు ఆమె సూచించారు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు బంగీజంప్ చేస్తే యువత ఆయన నుంచి చాలా మెలకువలు నేర్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. జగన్ హామీల్లో చంద్రబాబు కాపీ కొట్టకుండా మిగిలిపోయింది ఇక బంగీజంప్ మాత్రమేననీ, దయచేసి దాన్ని కూడా చేయాలని బాబు ను ఆమె కోరారు.

Related posts