telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ : .. భారత రాయబారి సహా .. అన్ని వాణిజ్య ఒప్పందాల రద్దు కు సిద్ధంగా ..

pak agreed to discuss on kartharpur issue

భారతప్రభుత్వం జమ్ముకశ్మీర్ పై తీసుకున్న నిర్ణయం పై మరోసారి పాక్ అక్కసు వెళ్లగక్కింది. ఇప్పటివరకు భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పాక్, ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి, భారత్ తో అన్ని రకాల సత్సంబంధాలను రద్దు చేసుకునేందుకు సిద్ధం అయ్యింది.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్సీ) ఈరోజు భేటీ అయింది. భారత్ తో దౌత్య సంబంధాలు తగ్గించాలని, ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అదే విధంగా, భారత్- పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలపై పున: సమీక్షించాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాయబారి కార్యాలయం నుండి భారత అధికారులను వెనక్కి పంపే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. అయితే ఇవన్నీ పాక్ లో ఉన్న ఉగ్రసంస్థల నేతలను సంతోషపెట్టేందుకే అని ఆ దేశానిర్ణయంపై తీవ్రవిమర్శలు కూడా వస్తున్నాయి.

Related posts