భూములు క్రయవిక్రయాలకు సంబంధించిన నమోదు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది, అధికారులు నిర్వాకం వినియోగదారులను ముప్పు తిప్పలు పెట్టిస్తోంది. పగటి సమయంలో సర్వర్ పనిచేయడంలేదనే సాకుతో క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల సమయంలో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కొన్న భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కృష్ణాజిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజానీకాన్ని విస్తుగొలుపుతున్నాయి. కార్యాలయసమయంలో పనులు చేయని కార్యాలయ సిబ్బంది… సబ్ రిజిస్ట్రార్ సహా బాధ్యతాయుతంగా రాత్రిపూట విధులు నిర్వర్తిస్తున్నారు. విధినిర్వహణలో బాధ్యత అనుకుంటే… పొరపాటేనని అక్కడి పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. భూముల కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజులతోపాటు… అదనంగా డబ్బులు ఇచ్చినోళ్లకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి… రిజిస్ట్రేషన్ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఇవ్వని వాళ్లకు మాత్రం పట్టపగలు చుక్కలే చూపిస్తారు.

కృష్ణాజిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న తీరు… పనితీరుకు అద్ధంపడుతోంది. ప్రతిరోజు… ప్రతి రిజిస్ట్రేషన్ కు ఇదే తరహాలో పనిచేస్తే… క్రయ విక్రయాదారులందరికీ సంతోషమే… కానీ అలా కాదు.. ఇక్కడ జరిగేది. క్రయవిక్రయాలను రిజస్ట్రేషన్ చేయించుకోవాలంటే… నిర్ణీత మొత్తాన్ని లంచం రూపంలో ఇవ్వాలి.. అలా ఇస్తే రాత్రిపూట పనులు చక్కదిద్దుతారు. ఎక్కడా మొహమాటంలేకుండా… డాక్యుమెంట్ల స్కానింగ్… రిజిస్ట్రేషన్ పోర్టల్ లో ఎంట్రీ, తదితర తతంగాన్ని పూర్తిచేస్తారు. పగటిపూట… క్రయవిక్రయదారులు ఫోటో క్యాప్చర్, డిజిటల్ సిగ్నేచర్, బయోమెట్రిక్ యాక్సిస్ డివైజ్ లో వేలిముద్రలిస్తే సరిపోతుంది.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనులు చేయించుకోడానికి పైసలిస్తే… త్వరితగతిన పూర్తిచేస్తారు. అలా ఇవ్వని పక్షంలో సర్వర్ పనిచేయదని మొహమాటంలేకుండా చెబుతారు. డబ్బులిస్తే… ఎలాంటి పనైనాసరే… గంటల్లో పూర్తిచేసిపెడతారనే విధానం కొనసాగిస్తున్నారు.


ఏపీలో పార్టీ పెట్టడంపై వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు..