అలాస్కాలో విచిత్రమైన సముద్ర జీవికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సారా వాసర్ ఆల్‌ఫర్డ్ అనే యువతి ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. అతి తక్కువ సమయంలోనే మిలియన్ వ్యూస్‌ను ఈ వీడియో సంపాదించింది. సారా అలాస్కా కోస్ట్‌లో చేపలు పడుతుండగా.. ఆమెకు ఈ వింత జీవి కనిపించినట్టు చెప్పుకొచ్చింది. నారింజ రంగులో ఉన్న విచిత్ర జీవి టెన్టాకిల్స్‌ను కదుపుతున్న ఈ జీవిని చూసిన వారందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు చాలా విచిత్రంగా ఉందంటూ కామెంట్ చేయగా… కొంతమంది ఈ జీవిని ఇదివరకే చూశామని.. దానిపేరు బాస్కెట్ స్టార్ అని అన్నారు. దాన్ని బాస్కెట్ స్టార్ అనే పిలుస్తారని చివరకు సారాకు తెలిసింది. స్టార్ ఫిష్ మాదిరిగానే ఈ జీవి కూడా టెన్టాకిల్స్ కలిగి ఉంటుందని, సముద్ర గర్భంలో ఇవి ఉంటాయని అనేక మంది తెలిపారు. ఈ వింతజీవికి ఎటువంటి హాని జరగకుండా తిరిగి నీళ్లలో విడిచిపెట్టినట్టు సారా తెలిపింది. మీరు కూడా ఈ వింత జీవిని వీక్షించండి.
previous post