telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

సర్వీస్ చార్జీల విషయంలో ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం..

బ్యాంకులలో ఖాతాదారులకు విధించే సర్వీస్ చార్జీల విషయంలో ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వరంగ బ్యాంకులు పీఎస్బిలకు సంబంధించిన చార్జీలు పెంచబోతున్నాయని ఇటీవలే మీడియాలో వార్తలు వచ్చాయి.  దీంతో బ్యాంకు కష్టమర్లు ఆందోళన చెందారు. చార్జీలు పెరిగితే ఇబ్బందులు పడాల్సి  రావొచ్చని కష్టమర్లు భావిస్తున్న తరుణంలో కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రభుత్వ రంగ బ్యాంకులు సర్వీస్ చార్జీలు పెంచబోవని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.  కోవిడ్ ప్రతికూల పరిస్థితుల ప్రభావం వలన ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ పై ఎలాంటి సర్వీస్ చార్జీలు పెంచడం లేదని స్పష్టం చేసింది.  అలానే ఇది జన్ ధన్ ఖాతాలకు కూడా వర్తిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.  ఇటీవలే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వీస్ చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది.  ఇప్పుడు కేంద్ర ఆర్ధిక తీసుకున్న నిర్ణయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నది. చుడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts