విశాఖపట్నం బీచ్ రోడ్‌లో జనభా రద్దీ ఎక్కువగా ఉంటున్నందున్న ఆంక్షలు విధించారు. ఈ మేరకు శని, ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు రోజులలో బీచ్ రోడ్డులో ప్రవేశం నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.
3వదశ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై పర్యాటక శాఖ మంత్రి ముత్తoశెట్టి శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జిల్లా కలెక్టర్ నిషేధం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వ సెలవు దినాలు, శనివారం, ఆదివారం రోజులలో సాయంత్రం 5.30 గంటల నుండి మరుసటిరోజు ఉదయం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
మూడవ దశ కొవిడ్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతిఒక్కరూ బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.