తీహార్ జైల్లో ఉన్ననిర్భయ దోషులకు దోషులకు ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పింది. దోషులకు శిక్ష అమలులో జాప్యంపై నిర్భయ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు దోషులకు డెత్ వారెంట్ జారీచేసింది. వాదనల సమయంలో.. తమకు న్యాయపరంగా అవకాశాలున్నాయని దోషుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ల దాఖలు ప్రక్రియ మొదలు పెట్టామని వారు తెలిపారు.
ఇది ఇలా ఉండగా.. దోషులకు డెత్ వారెంట్ వెంటనే జారీచేయాలని నిర్భయ తల్లిదండ్రుల తరపు న్యాయవాది కోరారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లకు అవకాశమున్నప్పుడు కూడా డెత్ వారెంట్ ఇవ్వొచ్చని కోర్టులో వాదించారు. క్యూరేటివ్ పిటిషన్ కు అవకాశముందని చెప్పి డెత్ వారెంట్ విడుదలను ఆపలేమని పేర్కొన్నారు. దోషులకు ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో నిర్భయం తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.