టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా”‘దొరసాని” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తెలంగాణాలో 80వ దశకంలో జరిగిన ఓ నిజజీవిత ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవీఆర్ మహేంద్ర డైరెక్ట్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. తాజాగా సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కి సోషల్ మీడియాలో నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా హీరోగా నటిస్తోన్న ఆనంద్ దేవరకొండపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. టీజర్ లో అతడి లుక్స్, నటనపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే దేవరకొండ బ్రదర్స్ ను అల్లు బ్రదర్స్ తో పోల్చుతున్నారు.
previous post


సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నాకు తెలియదు… బాలయ్య సంచలన వ్యాఖ్యలు