telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా !

Corona

కరోనా వైరస్ అన్నిరంగాల వారిని టచ్ చేస్తోంది. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా, ఏపీలో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారినపడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో నిన్న జిల్లా కొవిడ్ సెంటర్‌లో చేరారు.

నెల్లూరులో ఇటీవల కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు ఆ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

మరోవైపు, రాష్ట్రంలో ప్రతి రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1,062 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22,259కి చేరుకుంది.

Related posts