telugu navyamedia
సినిమా వార్తలు

నవలా మణీ!”

madhumasam poetry corner
నీవు చదివే ప్రణయ
నవల పుటల్లో
విశ్వ ప్రేమోదయంలో 
శ్వేత కపోతాలు మనమే కదా!
శుక వాణీ!
వనజాతముల హ్రదం చెంత
ప్రేమ వేదం వల్లె వేస్తున్న  చంద్రవదనా!
కువలయాక్షివే!
ఉజ్వలాంగీ!
నీ వంపుసొంపుల 
ప్రకృతి శోభ వర్ణించతరమా!
కనకాంగివే!
కర్పూర గంధివే!
ప్రేమ నవలా విపంచివే!
రుచిరాంగివే!
వర్ణాల హారంలో 
ముగ్ధమనోహరివే!
నవలా మణీ!
నీ రూపం నా హృదయంలో పదిలం-
నా శ్వాసకి నీవే సదా సుగంధ ఉత్పలం-
-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి

Related posts