telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది . సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల జరిగిన కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు.

అదే రోజున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు.

రెగ్యులర్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది.

Related posts