నీలాంటి బఫూన్ గాళ్లకి సమాధానం ఇచ్చేంత ఓపిక, తీరిక మా బాస్‌కి లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబుపవన్ సోదరుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ చేనేత వస్త్రాలు ధరించి ఫోటో పోస్ట్ చేయాలంటూ కేటీఆర్ పవన్ కల్యాణ్‌కు చాలెంజ్ విసిరితే, దాన్ని స్వీకరించి అదే చాలెంజ్‌ను పవన్..చంద్రబాబు సహా మరో ఇద్దరికి ఛాలెంజ్ విసిరారు.
ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు .కాటన్ దుస్తుల ఛాలెంజ్‌లు ఆపి, 175 సీట్లకి పోటీ చేస్తున్నారా లేదా అనేది స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా ప్రకటించాలంటూ రాంబాబు అన్నారు
దీంతో మంగళవారం ట్వీట్ చేసిన నాగబాబు… ‘‘ ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! బాబూ… ఓ రాంబాబు… జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసిపి సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకి లేదు. మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
అంతకుముందు నిర్మాత, సినీనటుడు బండ్ల గణేశ్ సైతం తన మార్క్ పంచులతో ఓ ట్వీట్ వదిలారు. ‘‘అలాగే రంభల రాంబాబు గారు మాస్టారు త్వరలో మీకు సమాధానం చెబుతారు … జై పవన్ కల్యాణ్ ’’అని పేర్కొన్నారు.
కాటన్ దుస్తుల ఛాలెంజ్‌లు ఆపి
175 సీట్లకి పోటీ చేస్తున్నారా! లేదా? ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి!@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) August 15, 2022
ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా!
బాబూ… ఓ రాంబాబు…
జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి,
వైసిపి సర్కస్ లో నీలాంటి
బఫూన్ గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక
మా జనసైనికులకి లేదు.
మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు. pic.twitter.com/kEW2ScNCCj— Naga Babu Konidela (@NagaBabuOffl) August 16, 2022
ఏపీ ఎన్నికల పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు