telugu navyamedia
క్రైమ్ వార్తలు

అర్ధ రాత్రి పిడుగు పడి నలుగురు మృతి..

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జామాయిల్ తోటలో పనిచేసేందుకు తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి దాదాపు 30 మంది కూలీలు బోగోలు వచ్చారు.. అక్కడే జామాయిల్ తోటల వద్ద గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వారు నిద్రలో ఉండగానే పిడుగు పడింది. ఒక్కసారిగా పిడుగు పడటంతో కూలీలు పరుగులు తీశారు. 

Related posts