కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఈని చర్యలు తీసుకున్న పరిస్థితి మారడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా.. మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపెల్లి హనుమంతరావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. “పార్టీశ్రేణులకు,కార్యకర్తలకు,ప్రజలకు,నాయకులకు మనవి. నాకు కోవిడ్ టెస్టులో పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు కోవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.” అని ఆయన స్వయంగా తెలిపారు.

