telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : చెన్నైకి షాక్… ముంబై దే విజయం

ఐపీఎల్ 2021 లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్ ఇస్తూ ముంబై ఇండైన్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో 219 పరుగుల భారీ లక్షయంతో బరిలోకి దిగ్గిన ముంబై జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ (35), క్వింటన్ డి కాక్ (38) పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(3) వెంటనే పెవిలియన్ కు చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత పోలార్డ్, క్రునాల్ పాండ్య బౌలర్ల పైకి ఎదురుదాడికి దిగడంతో మ్యాచ్ ముంబై వైపుకి మళ్లింది. కానీ క్రునాల్(32) ఔట్ అయిన తర్వాత హార్దిక్(16) వేగంగా ఆడే క్రమంలో ఔట్ అయిన పోలార్డ్ చివరి వరకు నాట్ ఔట్ గ అనిలిచాడు. అయితే ఓవర్ లో విజయానికి 16 పరుగులు కావాల్సి ఉండగా చివరి బంతికి రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. దాంతో పోలార్డ్(87) ఆ రెండు పరుగులు సాధించడంతో ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో ఈ ఐపీఎల్ లో రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది చెన్నై.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(50), మొయిన్ అలీ(58) అర్ధశతకాలతో రాణించగా చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచిన అంబటి రాయుడు 27 బంతుల్లో 72 పరుగులు చేసి ఆకట్టుకోవడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 218 పరుగులు చేసింది.

Related posts