telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : అదరగొట్టిన డికాక్… మొదటి స్థానానికి ముంబై…

ఈ రోజు అబుదాబి వేదికగా ఐపీఎల్ 2020 లో ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ జట్టులో కెప్టెన్ మోర్గాన్(39) పరుగులు చేయగా ఫాస్ట్ బౌలర్ కమిన్స్ (53) అర్ధశతకం చేయడంతో ఆ జాతు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ముంబై జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాని అందించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగుల వద్ద ఔట్ అయిన మరో ఓపెనర్ డికాక్ 78 పరుగులు చేసి చివరివరకు అజేయంగా నిలిచాడు. దాంతో ముంబై జట్టు 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అయితే కేకేఆర్ బౌలర్లలో శివం మావి, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ విజయంతో ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో మళ్ళీ మొదటి స్థానానికి వెళ్ళింది. ఇప్పటివరకు ఈ ఏడాది ఐపీఎల్ లో 8 మ్యాచ్ లు అడిగా ముంబై కి ఇది ఆరో విజయం. అలాగే తమ నాలుగో పరాజయాన్ని చూసిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో4వ స్థానంలో ఉంది.

Related posts