విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏపీ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో విశాఖ ప్రజలతో సహా, ఏపీ మొత్తం కదిలింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. నష్టాల సాకుతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని.. విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడను దెబ్బతీయడానికే ఇన్నాళ్లూ సొంత గనులు కేటాయించలేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ కోసం వెనకడుగు వేయకుండా పోరాడతానని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగాలని.. లేని పక్షంలో ఎటువంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. కేంద్రంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒత్తిడి తేవాలని.. ఏపీ క్యాబినెట్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య…దేశ సమస్య అని.. రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు మేం సిద్ధమే అని పేర్కొన్నారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే రోడ్డెక్కి ఆందోళనలు చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
previous post
next post


ఆరోపణలు చేసే వారు ఆధారాలతో మాట్లాడాలి: కోడెల