telugu navyamedia
రాజకీయ వార్తలు

మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబులాల్ గౌర్ కన్నుమూత

abul gour ex cm

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ ఈ ఉదయం భోపాల్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత వెంటిలేటర్‌పై ఉంచారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఆగస్టు 2004 నుంచి నవంబరు 2005 వరకు గౌర్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 జూన్ 1930న జన్మించిన బాబులాల్ మధ్యప్రదేశ్‌లో బీజేపీ విస్తరణకు శ్రమించి విజయం సాధించారు. అనారోగ్య కారణంగా గతేడాది ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Related posts