telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు: ఎంపీ బండి సంజయ్

bandi samjay mp

లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని కరీంనగర్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి మద్దతు ఇస్తున్న యువకులు, విద్యార్థులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.

ఈ వ్యవహారంలో పోలీసులు టీఆర్ఎస్ నేతలకే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదనీ, జాతీయ బీసీ కమిషన్ తో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Related posts