ఏపీ రాజకీయాల్లో రాజధాని అమరావతి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖలో నిర్వహించినకార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు మారుస్తున్నట్లు సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే రాజధాని వికేంద్రీకరణ అవసరమని తెలిపారు.
ఒక ప్రాంతమే అభివృద్ధి చెందితే మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి దూరం అవుతాయన్నారు. దీని వల్ల భవిష్యత్తులో ప్రాంతాల మధ్య చిచ్చు రగిలే ప్రమాదం ఎదురవుతుందని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. తనను నమ్మి అన్ని ప్రాంతాల వారు ఓట్లు వేశారన్న సత్యాన్ని గ్రహించే జగన్ పాలన సాగుతుందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాది వేసిన పోలవరాన్ని జగన్ పూర్తి చేసి తీరుతారని లక్ష్మీ పార్వతి చెప్పారు.
జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా.. రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోంది: నన్నపనేని