telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అత్యంత ప్రజాదరణ పొందిన … సీఎం ల జాబితా… 3వ స్థానంలో ఏపీసీఎం…

most popular cm list telugu cms in

అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో ఏపీసీఎం వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్ సంస్థ ‘దేశ్ కా మూడ్’ పేరిట నిర్వహించిన ఓ సర్వేలో 71 శాతం మంది జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వీడీపీ అసోసియేట్స్ ‘దేశ్ కా మూడ్’ పేరిట ఈ సర్వే చేపట్టింది.

జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్ పట్ల అత్యధికులు హర్షం వ్యక్తం చేసినట్టు వీడీపీ సర్వేలో వెల్లడైంది. ఈ మోస్ట్ పాప్యులర్ సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నంబర్ వన్ గా నిలిచారు. రెండో స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదో స్థానం దక్కింది.

Related posts