సిఎం కెసిఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల కౌంటర్ వేశారు. తెలంగాణ సర్కార్ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పోస్టులు భర్తీ చేస్తుందని పేర్కొన్న వైఎస్ షర్మిల.. సిఎం పదవిని కూడా కాంట్రాక్టు పద్దతిన చేపట్టాలని కెసిఆర్ కు చురకలు అంటించారు. “అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే .. ఇక సిఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే ..” అని ముచ్చట చెప్పిన కెసిఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయి, కరోనా విజృంభిస్తున్న వేళా .. కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించుకొన్నది ప్రభుత్వం. 2017 లో 3311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, ఆర్హత సాధించిన ఇంకా 658 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు కాంట్రాక్టు పద్దతి పై నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకొనే ప్రభుత్వం, ముందు ఆర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్ గా రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అని షర్మిల పేర్కొన్నారు. ఇక అంతకుముందు ట్వీట్ లో “కరోనా మహమ్మారి వల్ల మా కుటుంబం మరో ఆప్తుడిని కోల్పోయింది. నాన్నకు అత్యంత సన్నిహితులు గున్నం నాగిరెడ్డి అన్న మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నాగిరెడ్డి అన్న పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.”అని షర్మిల పేర్కొన్నారు.