telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

దళితులు ఉండే ప్రాంతంలో రాజధాని ఉండటం జగన్ కు ఇష్టం లేదు…

amaravathi ap

ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ… అమరావతి కోసం 300 రోజులు ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని అణచడానికి ఎన్నో కుట్రలు పన్నారు. అక్రమ కేసులు, అవమానాలు , అవహేళనలు చేసారు. మంత్రులు, స్పీకర్ సైతం రైతులు , మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వమే రైతుల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంది. ఓ కులం పై కసితో రాజధాని కక్ష్య కట్టారు అని తెలిపారు. అమరావతి లో దళితులు, వెనుకబడిన వర్గాలే అధికం. దళితులు ఉండే ప్రాంతంలో రాజధాని ఉండటం జగన్ కు ఇష్టం లేదు. ప్రాంతాల మద్య విద్వేషాలు రగిల్చేందుకే జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు అని అన్నారు. 3వేల రోజులైనా పోరాటం చేసి అమరావతి ని సాదించుకుంటాం. పోలీసులతో ఉద్యమాన్ని ఆపలేరు. మరల టీడీపీ అధికారం లోకి వస్తుంది. అమరావతి ని ప్రపంచ స్దాయి నగరంగా రూపుదిద్దుతాం అని మంత్రి నక్కా ఆనంద బాబు తెలిపారు. ఇక ”సోమవారం ఉద్యమానికి 300 రోజులు అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిర్వహించే నిరసన కార్యక్రమాలలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొని మద్దతుగా నిలవండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించండి” అని టీడీపీ అదినేత చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts